ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వాగులో పడి రామానాయుడు అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన రామానాయుడు వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న క్రమంలో ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చింది తప్పించే క్రమంలో నక్కల వాగు లో పడ్డాడు వెంటనే క్షతగాత్రుడిని వెలికి తీసి అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామానాయుడు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

