Tv424x7
Andhrapradesh

నూతన సిసి రోడ్డును ప్రారంభించిన మంత్రి ఫరూక్

నంద్యాల పట్టణంలోని రూ.1.40 కోట్ల తో పద్మావతి నగర్ నూతన సీసీ రోడ్డును మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ లాంచనంగా పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సిసి రోడ్డును నిర్మించడం పిఏవి గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి వేణు గోపాల్ అభినందనీయమన్నారు. అనంతరం పబ్బతి వేణుగోపాల్ ను మంత్రి ఫరూక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పద్ధతి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాపు యజమానులు, మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఆర్డిఓ విశ్వనాధ్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ,ఎంఈ గురప్ప యాదవ్ ,డి ఇ లు నాగభూషణ్ రెడ్డి ,పవన్ రసూల్ ఏఈ హిమబిందు రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ నరహరి విశ్వనాథరెడ్డి,టిడిపి కౌన్సిలర్లు జైనాబి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏప్రిల్ 6 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పర్వతరెడ్డి..?

TV4-24X7 News

సిద్ధం’ అని నువ్వు అనడం కాదు… నిన్ను దించడానికి మేం ‘సిద్ధం’గా ఉన్నాం: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment