Tv424x7
Andhrapradesh

జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఏచూరి….

సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి, మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లాలో ఘన నివాళులు అర్పించారు.

సత్తెనపల్లి:

పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ –ఏచూరి విద్యార్థి దశనుండి ప్రజా నాయకుడిగా ఎదిగారు.

శ్రామిక జీవుల కోసం తన జీవితం అంకితం చేశారు.

బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక చట్టాలు అమలు చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటు కంపెనీలకు అమ్మే యత్నాలను ఐక్య పోరాటాలతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

సీనియర్ నేత గద్దె చలమయ్య మాట్లాడుతూ –”ప్రజల మనసులు గెలవని ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలబడవు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితులను మోడీ గమనించాలి” అని హెచ్చరించారు.📍

మాచర్ల:

స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన వర్ధంతి సభలో ఎస్‌.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ –”ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్క్సిస్టు మేధావి ఏచూరి” అని కొనియాడారు.

అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టం ఆవిర్భావంలో ఆయన కీలకపాత్ర వహించారని గుర్తు చేశారు.

బిజెపి మతోన్మాద విధానాలను ఎదుర్కొని ఇండియా బ్లాక్ ఏర్పాటు చేయడంలో పెద్ద పాత్ర వహించారని తెలిపారు.”ఏచూరి స్ఫూర్తితో పోరాడాలి” అని పిలుపునిచ్చారు.

సభల్లో పలువురు సిపిఎం నాయకులు, న్యాయవాదులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

హెూంమంత్రి ఆదేశాలతో రంగంలోకి విశాఖ పోలీసులు

TV4-24X7 News

మత్తుకు బానిస అవద్దు జీవితం పాడు చేసుకోవద్దు వన్ టౌన్ సిఐ

TV4-24X7 News

ఏపీలో హాస్టల్ విద్యార్థులకూ ఫేస్ రికగ్నిషన్!

TV4-24X7 News

Leave a Comment