Tv424x7
Andhrapradesh

నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం..!!

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా నూతనంగా ఎన్నికైన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌(67) శుక్రవారం 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరుగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎన్డీఏ పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఇండియా కూటమి నేతలకు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహా్వన లేఖలు పంపినట్లుగా తెలిసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగా సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించారు.

Related posts

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన గాజువాక సీఐ

TV4-24X7 News

నారా లోకేష్ కర్మలను సోషల్ మీడియాలో ప్రశంసలు…

TV4-24X7 News

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

TV4-24X7 News

Leave a Comment