కడప /మైదుకూరు :దువ్వూరు టౌన్‌లోని మహానందీశ్వర ట్రేడర్స్ యాజమాన్యం యూరియా బస్తాలను అక్రమంగా తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే… 11.09.2025 రాత్రి సమయాల్లో సదరు ట్రేడర్స్ వారు యూరియా బస్తాలను బయటకు తరలించారని పత్రికా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 12.09.2025 ఉదయం 10.30 గంటలకు జిల్లా జేడీ చంద్రా నాయక్, మైదుకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. కృష్ణమూర్తి, దువ్వూరు మండల వ్యవసాయ అధికారి పి. అమరనాథ్ రెడ్డి, దువ్వూరు పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్స్పెక్టర్ ఎస్. వినోద్‌కుమార్ లు కలిసి సదరు ట్రేడర్స్ వద్ద తనిఖీలు నిర్వహించారు.తనిఖీ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న చాగం వినీత్ కుమార్ రెడ్డి ద్వారా రికార్డులు పరిశీలించగా, 200 బస్తాల్లో 27 బస్తాలు తక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విచారణలో ఆ బస్తాలను ప్రజలను మోసగించి అధిక ధరలకు విక్రయించినట్టు తేలింది.దీంతో మిగిలి ఉన్న 173 బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ కోర్టుకు 65(a) EC Act కింద కేసు నమోదు చేసి పంపించారు. అలాగే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని దువ్వూరు పోలీస్‌స్టేషన్ SHOకి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
previous post

