భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని క్రాంతి విద్యాలయం ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి విద్యార్థి లోకేష్ (7) అనుమానాస్పదంగా మృతిచెందాడు.
ఈ సంఘటనతో పాఠశాల పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.బాలుడి మృతిపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నారి పాఠశాలకు ఆరోగ్యంగా వెళ్లి తిరిగి ఇంటికి రాకముందే విషాదం సంభవించిందని, పాఠశాల నిర్వహణ నిర్లక్ష్యం కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. చిన్నారి మృతిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి గల నిజమైన కారణం బయటపడనుంది

