అమరావతి:
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర విభాగాలపై సమీక్ష జరపడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు.
మొదటి రోజు – సెప్టెంబర్ 15జీఎస్డీపీపై ప్రజెంటేషన్, సేవల రంగం, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం రంగాల పురోగతి సమీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.
సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్, అన్నా క్యాంటీన్లు, P4 వంటి పథకాలపై సమీక్ష జరుగనుంది. లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌తో పాటు స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అంశాలు జిల్లాల వారీగా పరిశీలనలోకి రానున్నాయి.
రెండవ రోజు – సెప్టెంబర్ 16మానవ వనరుల అభివృద్ధి, వైద్య ఆరోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్పై సమీక్ష ఉంటుంది. ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాలు, క్వాంటం వ్యాలీ, RTIH, వాట్సప్‌లో పౌరసేవలు, డేటా లేక్, AI వంటి అంశాలు చర్చించనున్నారు. రెవెన్యూ విభాగం భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్‌పై సమీక్ష జరగనుంది.
చివరగా రాష్ట్ర శాంతిభద్రతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
రాష్ట్ర పరిపాలనలో వేగవంతమైన నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం చేయడమే ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

