Tv424x7
National

సుప్రీంకోర్టు దృఢ వైఖరి – గవర్నర్లపై గడువు తప్పనిసరి..

న్యూఢిల్లీ :

రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్లు అంతులేని జాప్యం చేయరాదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.

మూడునెలల వ్యవధిలో ఆమోదం ఇవ్వాలి లేదా రాష్ట్రపతికి పంపాలి తప్ప, బిల్లులను అట్టిపెట్టడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిజెఐ బి.ఆర్‌.గవాయి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తమకు ముందుకు వచ్చిన బిల్లును గవర్నర్లు నిరవధికంగా పక్కన పెట్టేస్తే అది “చచ్చిపోయినట్టే” భావించాలనే కేంద్ర వాదనను న్యాయమూర్తులు కొట్టిపారేశారు.

సభలో చర్చించి ఆమోదించిన చట్టాన్ని ఒక వ్యక్తి ఎలాంటి గడువు లేకుండా నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.తమ బాధ్యతల్లో విఫలమయ్యే రాజ్యాంగ పదవులపై న్యాయస్థానం నిస్సహాయంగా కూచోవదని, అవసరమైతే తాము జోక్యం చేసుకుంటామని సిజెఐ గవాయి తేల్చిచెప్పారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి అట్టిపెట్టిన పది బిల్లులపై స్టాలిన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

🔹 రాజకీయ వాదోపవాదాలుఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పు తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరగా, కేంద్రం – రాష్ట్రాల మధ్య ఈ అంశం మరోసారి ఘర్షణాత్మకమైంది. బీజేపీ అనుకూల వర్గాలు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించలేదని వాదిస్తుండగా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం ఈ తీర్పుతో సమాఖ్య వ్యవస్థకు రక్ష లభిస్తుందని భావిస్తున్నాయి.

🔹 ముఖ్యమైన సూచనసుప్రీంకోర్టు స్పష్టంగా మూడు నెలల వ్యవధి ఒక కాలక్రమణిక మాత్రమేనని, కానీ గవర్నర్లు నిరవధికంగా బిల్లులను అట్టిపెట్టే హక్కు లేదని తేల్చిచెప్పింది.

Related posts

62 ఏళ్ల తర్వాత నిజమైన ఓ తల్లి కల….

TV4-24X7 News

నువ్వా నేనా: బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్‌ మహాఘట్‌బంధన్__ ది వైర్ స్టాఫ్!!

TV4-24X7 News

18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ

TV4-24X7 News

Leave a Comment