హైదరాబాద్, పాతబస్తీ:
మానవత్వాన్ని మరిచిపోయిన తండ్రి.. కన్నబిడ్డనే హతమార్చిన ఘోర ఘటన నగరంలో వెలుగుచూసింది.
మూడేళ్ల కొడుకును హత్య చేసి మూసీలో విసిరేసిన తండ్రి
👉 భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు
👉 రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా పోలీసులు, గజ ఈతగాళ్లుహైదరాబాద్, .బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్ (35), సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఒక సంవత్సరం, రెండో కుమారుడు మహ్మద్ అనాస్ (3). కూరగాయల వ్యాపారం చేసే అక్బర్, నిలోఫర్ ఆసుపత్రిలో కేర్ టేకర్‌గా పని చేసే సనాబేగంతో తరచూ కుమారుడి అనారోగ్యంపై గొడవలు పెట్టుకునేవాడు.
శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్లిన వేళ.. తెల్లవారుజామున అక్బర్ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారి తలపై దిండుతో ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సంచిలో కట్టి, బైక్‌పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ వద్ద నుంచి మూసీలో విసిరేశాడు.
తరువాత తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి “నా కొడుకు కనిపించడం లేదు, బంధువులు తీసుకెళ్లి వదిలేశారంటూ ఫోన్ వచ్చింది” అని అబద్ధపు ఫిర్యాదు చేశాడు.
అయితే ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో అక్బర్ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు నిజానిజాలు బయటపెట్టారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు – ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు కలిసి మూసీ నదిలో మృతదేహం కోసం శోధిస్తున్నారు.

