ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడంపై ఆయన తల్లి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు.
“నా కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. నేను కూడా ఆయనలాగే టీచర్‌గా పనిచేశాను. అందుకే నా కుమారుడికి ఆయన పేరు పెట్టాను. అప్పుడు నా భర్త.. ‘ఏదో ఒక రోజు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నావా?’ అని అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. ఈ రోజు నాకు ఎంతో గర్వంగా ఉంది” అని జానకీ అమ్మాల్ అన్నారు.
👉 తల్లి ఆశీస్సులతోనే ఈ విజయానికి చేరుకున్నానని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా అభిప్రాయపడ్డారు.
అనూష
.

