Tv424x7
Andhrapradesh

తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై హోం మంత్రి సమీక్ష..

తిరుమల:

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ, పోలీస్‌ అధికారులతో హోం మంత్రి శ్రీమతి వి. అనిత సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను ఘనంగా, లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం నేపథ్యంలో భద్రతా చర్యలు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, క్యూలైన్లలో సౌకర్యాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాట్లు వంటి అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉండాలని హోం మంత్రి వి. అనిత స్పష్టం చేశారు.

Related posts

చిన్న సింగనపల్లెలో ఘనంగా సీతారామ కళ్యాణం

TV4-24X7 News

అవి గంజాయి చాక్లెట్లే

TV4-24X7 News

జమ్మలమడుగులో వినాయక లడ్డూ పై వైఎస్ జగన్ పేరు ప్రతిష్టాత్మకం..

TV4-24X7 News

Leave a Comment