👉 నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనంతరం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అంశంపై సీఎం, మంత్రులు సాధ్యాసాధ్యాలు చర్చించనున్నారు.
ఇకపోతే, హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో, అప్పీల్‌కు వెళ్లే అవకాశాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

