Tv424x7
Telangana

60 ఏళ్ల వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఫోక్సో కోర్ట్… ఎందుకో తెలుసా…?

నల్గొండ జిల్లా,

నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న చిన్నారి అత్యాచార ఘటనపై పోక్సో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది.

ఘటన వివరాలు:

2023 మార్చి 28న, ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న పదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు దారుణంగా అత్యాచారం చేశాడు.

మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు.

కోర్టు తీర్పు:రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

అదనంగా రూ.40 వేలు జరిమానా కూడా విధించారు.బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ తీర్పు భవిష్యత్తులో చిన్నారులపై జరిగే లైంగిక దాడి కేసులకు తీవ్రమైన హెచ్చరికగా నిలుస్తుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.

Related posts

రాజకీయ కుట్రలకు అధికారులు బలి

TV4-24X7 News

నల్గొండలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..

TV4-24X7 News

ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు…

TV4-24X7 News

Leave a Comment