హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ సరఫరా వ్యవస్థ నిలిచిపోనుంది. అక్టోబర్ 1వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయనున్నట్టు రేషన్ డీలర్ల సంఘాలు ప్రకటించాయి.
ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న కమిషన్ నిధులు విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న డీలర్లు, పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు అందజేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని వారు ఆరోపిస్తున్నారు.
“వెంటనే బకాయిలు చెల్లించకపోతే, సమ్మెను మరింత ఉదృతం చేస్తాం” అని రేషన్ డీలర్ల సంఘం నేతలు హెచ్చరించారు.
ఈ బంద్ కారణంగా లక్షలాది కుటుంబాలకు రేషన్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

