సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. గత ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న కలెక్టరేట్‌లో తమ సమస్యలను వినిపించిన తర్వాత, సంఘం జిల్లా అధ్యక్షుడు అశోకును అక్రమంగా అరెస్టు చేశారని ఉద్యోగులు ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
అదే విధంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఇకపై ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ను కోరారు.
ఈ ధర్నా కారణంగా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించడంతో ఆసుపత్రిలోని ఔట్‌పేషంట్ (ఓపీ) సేవలు నిలిచిపోయాయి. దీంతో చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

