Tv424x7
Telangana

కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023లో తనకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ మోసగించారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ ఇస్తానని కేఏ పాల్త న నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది.రూ.30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించానని, మిగిలిన రూ.20 లక్షలను పలు దఫాలుగా చెల్లించినట్లు ఫిర్యాదు పేర్కొన్నాడు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.కాగా.. ఈ నెల 13న జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేఏ పాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. తానే గెలవబోతున్నట్టు పాల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాను గెలవబోతున్నట్టు ఇంటెలిజెన్సీ వాళ్లు కూడా తనతో చెప్పారని ఆయన అంటున్నారు. మరి జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల్లో ఆయన అదృష్టం ఏవిధంగా ఉందో వేచిచూడాలి..

Related posts

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడితో సీఎం రేవంత్‌ చర్చ

TV4-24X7 News

నిమజ్జనం కోసం తీసుకెళ్లిన ట్రాలీ ఆటో చెరువులో పడడంతో తండ్రితో పాటు ఏడేళ్ల కొడుకు మృతి.

TV4-24X7 News

టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత!!

TV4-24X7 News

Leave a Comment