గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్‌ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి నేతలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు.
ప్లకార్డులు పట్టుకుని కమిషన్ కార్యాలయం వైపు కదిలిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ఎదుట బైఠాయించిన వారు “టీఎస్పీఎస్సీ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు జాగృతి నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
జాగృతి నాయకులు మాట్లాడుతూ,
గ్రూప్-1 పోస్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
తిరిగి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమం కొనసాగుతుందని, అభ్యర్థులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

