ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మంగళవారం పట్టణంలోని డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో సమావేశమయ్యారు.
ఇటీవల విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని కారణంగా కొంతమంది యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎమ్మెల్యే స్పందించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టంగా యాజమాన్యాలను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పరీక్షల ఫీజులు మాత్రమే విద్యార్థుల వద్ద నుంచి సేకరించాలని ఆయన యాజమాన్యాలకు సూచించారు.

