Tv424x7
National

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు – ఓటు హక్కు, వక్ఫ్‌బోర్డు పరిరక్షణపై ఊరటనిచ్చిన తీర్!!

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (సర్‌) పేరిట లక్షల ఓట్లు తొలగింపుపై, అలాగే వక్ఫ్‌బోర్డు చట్ట సవరణలపై దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఓటు హక్కు విషయంలో:
ఎన్నికల కమిషన్ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని తేలితే “సర్‌ ప్రక్రియను రద్దు చేస్తాం” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్‌తో అన్ని సేవలను లింక్‌ చేస్తున్న ప్రభుత్వమే ఓటర్ల నమోదులో మాత్రం దాన్ని పక్కన పెడుతుందన్న ప్రజల ప్రశ్నను ఆమోదించి, ఇకపై ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. తుది తీర్పు కేవలం బీహార్‌కే కాకుండా దేశవ్యాప్తంగా వర్తిస్తుందని కోర్టు తెలిపింది.

వక్ఫ్‌బోర్డు సవరణలపై:
వక్ఫ్‌బోర్డు చట్ట సవరణల్లోని ముఖ్య అంశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ముఖ్యంగా, ముస్లిమేతరులు వక్ఫ్‌బోర్డుకు ఆస్తులు దానం చేయాలంటే ఐదు సంవత్సరాలుగా ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నట్లు నిరూపించాలన్న కొత్త నిబంధనపై కోర్టు నిలుపుదల ఆదేశాలు ఇచ్చింది.
అలాగే, బోర్డు ఎక్స్‌ అఫీషియో అధికారి ముస్లింలలోనే ఉండాలని, సభ్యుల్లో మెజార్టీ ముస్లింలే ఉండాలని స్పష్టం చేసింది.

🔹 కోర్టు తాజా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం, లౌకికత్వానికి రక్షణ కల్పించే దిశగా ఉన్నాయని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.
🔹 ప్రతిపక్ష పార్టీలు “ఓటు హక్కు రక్షణ” కోసం పోరాటం చేస్తున్న వేళ, సుప్రీంకోర్టు జోక్యం ప్రజలకు ధైర్యం నింపిందని పేర్కొన్నాయి.

👉 తుది తీర్పులో మరింత స్పష్టత ఇవ్వాలని ప్రజలు, నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

భవిష్యత్తు కోసం ఉప్పెనై లేచిన నేపాల్ యువత..

TV4-24X7 News

ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్

TV4-24X7 News

ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

TV4-24X7 News

Leave a Comment