Tv424x7
AndhrapradeshNationalఆరోగ్యం

దేశవ్యాప్తంగా మహిళలకు శుభవార్త…! ఏంటో తెలుసా…?

విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేత బుధవారం ప్రత్యేక వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా “స్వస్థ్ నారీ సశక్త్ కుటుంబ అభియాన్” పేరుతో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఈ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

ఇందోర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.

🔹 రాష్ట్రవ్యాప్తంగా 14,500 వైద్య శిబిరాలు నిర్వహణ
🔹 8,181 మంది స్పెషలిస్టు వైద్యులు సేవలు అందించనున్నారు
🔹 లక్ష్యం – కోటి మందికి పైగా ఆరోగ్య పరీక్షలు
🔹 నిర్వహణలో 4,000 మంది సిబ్బంది – సచివాలయాలు, అంగన్వాడీలు, ఆరోగ్యశాఖ
🔹 మహిళా-శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, మునిసిపల్, విద్యాశాఖ, IMA, రెడ్‌క్రాస్ సహకారం

ఈ శిబిరాల్లో మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. అలాగే చిన్నారులకు టీకాలు వేయనున్నారు.

Related posts

అంగన్ వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వ సంచలన ఉత్తర్వులు

TV4-24X7 News

అప్పన్నను దర్శించుకున్న వాసుపల్లి ఫ్యామిలీ

TV4-24X7 News

చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని బహిరంగ లేఖ

TV4-24X7 News

Leave a Comment