Tv424x7
Andhrapradesh

భార్యను దారుణంగా కొట్టిన భర్తపై కేసు!!


తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో భర్త గురునాథం బాలాజీ తన భార్య భాగ్యమ్మను కట్టేసి బెల్టుతో దారుణంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం సృష్టించింది.

ఈ ఘటనపై స్పందించిన దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బ్రహ్మనాయుడులు ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలి కుటుంబ సభ్యులను విచారించారు. నిందితుడు బాలాజీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

భార్యను తీవ్రంగా గాయపరిచిన కారణంగా బాధితురాలు భాగ్యమ్మను మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related posts

ఇకపై మూడు నెలలకోసారి పెన్ష‌న్లు..!

TV4-24X7 News

మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస..

TV4-24X7 News

మంగళగిరి పట్టణంలో భారీగా మద్యం స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment