Tv424x7
National

ప్రధాని మోదీ బయోపిక్ ప్రకటన!!

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన ప్రధాని నరేంద్ర మోదీ జీవితగాథ వెండితెరపైకి రాబోతోంది. “మా వందే” అనే పేరుతో ఆయన బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మోదీ పాత్రను యువ నటుడు ఉన్నిముకుందన్ పోషించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వీర్ రెడ్డి నిర్మించగా, క్రాంతికుమార్ దర్శకత్వం వహించనున్నారు. మోదీ బాల్యం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు సినిమాలో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి.

పలు భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ బయోపిక్ ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే నటీనటుల జాబితా, షూటింగ్ వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

సినీ వర్గాల అంచనాల ప్రకారం “మా వందే” బయోపిక్ దేశవ్యాప్తంగా భారీ చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

Related posts

నేపాల్‌ ఆర్మీ ముందుకు జెన్‌జీ డిమాండ్లు.

TV4-24X7 News

పండగ సీజన్‌లో రైతులకు సంతోషకరమైన వార్త..

TV4-24X7 News

టెన్త్ అర్హతతో 500 ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్

TV4-24X7 News

Leave a Comment