Tv424x7
Andhrapradesh

మార్కాపురం జార్జి కళాశాలలో ర్యాగింగ్ అవేర్‌నెస్ కార్యక్రమం!!


మార్కాపురం పట్టణంలోని జార్జి కళాశాలలో 2025–26 బ్యాచ్ విద్యార్థుల కోసం మంగళవారం ర్యాగింగ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ యు. నాగరాజు, సీఐ సుబ్బారావు, ఎస్సై సైదులు బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్, ఆకతాయితనాలు, డ్రగ్స్, మత్తు పదార్థాల వలన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి వాటికి పాల్పడిన వారెవరైనా కఠిన శిక్షలకు గురవుతారని విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి. ప్రసన్న, వై. సునీత, అధ్యాపక బృందం పాల్గొన్నారు. పోలీసు అధికారులను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు సన్మానించారు.

Related posts

మాజీ సీఎంతో వాసుపల్లి భేటీ

TV4-24X7 News

ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలి కందుల నాగరాజు

TV4-24X7 News

బనగానపల్లె మండల పరిషత్ సర్వసభ్య సమావేశం – అభివృద్ధి, సంక్షేమం పై చర్చ!!

TV4-24X7 News

Leave a Comment