Tv424x7
Crime NewsTelangana

మామూలు కేటుగాళ్లు కాదు …ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం

హైదరాబాద్‌:

సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్ముపై కన్నేసిన మోసగాళ్ల గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన పొట్ల రవి అనే వ్యక్తి ఈ స్కామ్‌కు సూత్రధారి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్ పేషీలో పనిచేసిన రవి, చెక్కుల మంజూరులో కీలక పాత్ర పోషించేవాడు. ఈ ప్రభావంతో లబ్ధిదారులకు చేరాల్సిన 19 చెక్కులను దాచిపెట్టి, నకిలీ ఖాతాల ద్వారా ₹8.71 లక్షలు కాజేశాడు.

పోలీసులు వెల్లడించిన వివరాలు:బాధితుల పేర్లకు సరిపోయేలా నకిలీ వ్యక్తులను సృష్టించారు.

చెక్కులను క్యాష్ చేసి డబ్బును పంచుకున్నారు.

జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేశారు.

అరెస్టయినవారు:

పొట్ల రవి (ప్రధాన నిందితుడు)

జనగామ నాగరాజు

మటేటి భాస్కర్

కాంపల్లి సంతోష్

చిట్యాల లక్ష్మి

అసెంపల్లి లక్ష్మి

మరికొందరు నిందితులు పరారీలో ఉండగా, పోలీసులు వారిని వెతికే పనిలో ఉన్నారు. దుర్వినియోగం అయిన నిధులను తిరిగి అసలు లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణాలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

TV4-24X7 News

తిరుపతిలో మిస్టరీ మరణాలు – అటవీ ప్రాంతంలో 4 మృతదేహాలు కలకలం!

TV4-24X7 News

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.

TV4-24X7 News

Leave a Comment