Tv424x7
Telangana

త్వరలో గ్రూప్-2 ఫలితాలు – TGPSC సన్నాహాలు వేగవంతం!!


తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాల విడుదలకు టీఎస్పీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల అర్హతలు, వారు సమర్పించిన ఆప్షన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా సిద్ధం చేస్తోంది.

మూడు నెలల క్రితమే ఈ ఫలితాలను ప్రకటించాలని కమిషన్ నిర్ణయించినా, గ్రూప్-1 పరీక్షలపై నడుస్తున్న న్యాయవివాదాల కారణంగా ఫలితాల ప్రకటన ఆలస్యమైంది. అయితే తాజాగా అన్ని అంశాలను సమీక్షించిన తర్వాత, త్వరలోనే గ్రూప్-2 తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది శుభవార్త కానుంది.

Related posts

రోడ్డెక్కిన 10వ తరగతి విద్యార్థులు…. ఎందుకో తెలుసా….

TV4-24X7 News

మంత్రి సీతక్క ఇలాకాలో పంచాయతీల దుస్తితి….. ఇలా….

TV4-24X7 News

హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?

TV4-24X7 News

Leave a Comment