Tv424x7
Telangana

రోడ్డెక్కిన 10వ తరగతి విద్యార్థులు…. ఎందుకో తెలుసా….

మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం :

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత 4 నెలలుగా సోషల్ టీచర్ లేకపోవడంతో పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులు చదువులో వెనుకబడిపోతున్నారు.

తమ భవిష్యత్తు పట్ల ఆందోళన చెందిన విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. “సోషల్ టీచర్ లేకపోతే మేము 10వ తరగతి పరీక్షల్లో ఎలా పాస్ అవుతాం?” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి రోజూ పాఠశాలకు వెళ్తున్నా, టీచర్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్‌లో ప్రాథమిక పాఠాలే పూర్తికాలేదని విద్యార్థులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

👉 విద్యార్థుల సమస్యపై తక్షణమే స్పందించి సోషల్ టీచర్‌ను నియమించాలని స్థానికులు విద్యాశాఖను డిమాండ్ చేస్తున్నారు.

Related posts

దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి : కేటీఆర్..!!

TV4-24X7 News

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..

TV4-24X7 News

లోకల్ ఎలక్షన్స్ తర్వాతే కవిత రాజీనామా ఆమోదం?

TV4-24X7 News

Leave a Comment