Tv424x7
Andhrapradesh

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విస్తృత సోదాలు…

హైదరాబాద్‌:

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. బుధవారం తెల్లవారుజామున దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్‌లోనే 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. స్కామ్‌కు సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు, కంపెనీలు, షెల్ ఫిర్ములపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

అక్రమ లావాదేవీలు, హవాలా ద్వారా నిధుల మళ్లింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సీబీఐ, ఎస్ఐటి దర్యాప్తుతో పాటు ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ కోణంలో విచారణ కొనసాగిస్తోంది.

కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు ఈడీ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కీలక వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు విచారణకు హాజరుకావాల్సి ఉండొచ్చని సమాచారం.

Related posts

విజయసాయి రెడ్డిని విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం

TV4-24X7 News

బెయిల్ వచ్చినా….. ప్రభుత్వం జైల్లోనే ఉంచ్చారంట…..

TV4-24X7 News

పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్

TV4-24X7 News

Leave a Comment