Tv424x7
National

యోగి మార్క్ శాంతిభద్రతలు… నేటి కాలానికి కరెక్ట్!

📌 లక్నో –

ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన వైఖరి మరోసారి రుజువైంది.

హీరోయిన్ దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు యువకులను పోలీసులు 24 గంటల్లోనే వెదికి పట్టుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరూ మృతిచెందినట్లు యూపీ పోలీసులు ప్రకటించారు.

ఈ ఘటన వెనుక కెనడాలో దాక్కున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హస్తం ఉన్నట్లు అనుమానం. సెలబ్రిటీలను బెదిరించి గ్యాంగ్ విస్తరణకే ఈ చర్యలని పోలీసులు చెబుతున్నారు.

ఘటన తెలిసిన వెంటనే సీఎం యోగి, దిశా పటాని తండ్రికి కాల్ చేసి నిందితులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు.

యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలో వందలాది ఎన్‌కౌంటర్లు జరిగాయి. రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు దిగి రాకుండా చేశారు. విమర్శలు ఉన్నా, అసాంఘిక శక్తుల అణచివేతకు కఠిన చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అరాచకశక్తులకు ఉపేక్ష ఉండదనే సంకేతం మరోసారి యూపీ నుంచి స్పష్టమైంది.

Related posts

62 ఏళ్ల తర్వాత నిజమైన ఓ తల్లి కల….

TV4-24X7 News

మే 20న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు

TV4-24X7 News

వినాయక చవితి పూజా విధానం

TV4-24X7 News

Leave a Comment