Tv424x7
Andhrapradesh

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం..

పెద్దపల్లి జిల్లా

రామగుండం ESI హాస్పిటల్, ఎయిర్‌పోర్ట్ వివరాలు అడిగితే కూడా స్పందించకపోవడం పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ,“ఒక ఎంపీ హోదాలో వివరాలు అడిగితే కూడా సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది?” అని ప్రశ్నించారు.

మహిళలకు ప్రధాన మంత్రి మాతృవందన పథకం ప్రయోజనాలను వివరించిన ఎంపీ, ఆసుపత్రికి అంబులెన్స్ అవసరం ఉందని ప్రజల డిమాండ్‌పై MP లాడ్స్ నిధుల ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

తరువాత కొత్త ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

👉 ప్రజా సమస్యలపై స్పందించకపోవడం కలెక్టర్ బాధ్యతారాహిత్యం అని మండిపడిన ఎంపీ, “ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాల్సిన బాధ్యత మీదే” అని కలెక్టర్‌కు హెచ్చరించారు.

ఎంపీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, కలెక్టర్ అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.

Related posts

దీపావళికే 3 లక్షల గృహప్రవేశం – మరో 6 లక్షల ఇళ్లు వచ్చే జూన్ లోపల..

TV4-24X7 News

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసిన సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

ఢిల్లీకి సీఎం జగన్?

TV4-24X7 News

Leave a Comment