Tv424x7
Andhrapradesh

ఏపీ అసెంబ్లీలో GST సంస్కరణలపై చర్చ…

అమరావతి:గతంలో 17 రకాల పన్నులు, 8 రకాల సెస్‌లతో వ్యాపార రంగం గందరగోళంలో పడేదని అసెంబ్లీలో సభ్యులు గుర్తు చేశారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా పన్నులు వసూలు చేయడం వల్ల ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST వల్ల దేశవ్యాప్తంగా “ఒకే దేశం – ఒకే పన్ను” విధానం అమలులోకి వచ్చిందని సభలో అభిప్రాయపడ్డారు.

వ్యాపార సౌలభ్యం పెరగడంతో పాటు పన్ను విధానంలో పారదర్శకత వచ్చిందని, నూతన సంస్కరణలతో భవిష్యత్తులో Next Gen GST మరింత సమగ్రంగా ఉండబోతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ – GST వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాబడుతున్నాయని, పన్నుల ఎగవేత తగ్గిందని, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఊతం లభించిందని అన్నారు.

Related posts

సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు…

TV4-24X7 News

పేరుకే జిల్లా హాస్పిటల్..నిర్లక్ష్యంగా డాక్టర్లు, స్టాఫ్

TV4-24X7 News

శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం

TV4-24X7 News

Leave a Comment