Tv424x7
Andhrapradesh

గ్రామ సచివాలయంలో యూరియా అవగాహన సదస్సు…

కడప/మైదుకూరు :

దువ్వూరు మండలం చింతకుంట వన్ గ్రామ సచివాలయంలో యూరియా పై అవగాహన సదస్సు, యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్రనాయక్, ఉద్యానవన జిల్లా సహాయ సంచాలకులు రవీంద్రబాబు, స్థానిక తాసిల్దార్ సంజీవరెడ్డి, మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ –రైతులకు యూరియా కొరత లేదని, సకాలంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎకరాకు 76 నుంచి 90 కిలోల లోపే వాడాలని సూచించారు. అధిక మోతాదులో వాడితే చీడపీడలు, తెగుళ్లు పెరిగి పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని రైతులను హెచ్చరించారు.

సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్రనాయక్ మాట్లాడుతూ –జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ప్రతి రైతుకు అవసరమైనంత యూరియా అందిస్తామని తెలిపారు. రైతులు అధిక మోతాదులో వాడరాదని ప్రత్యేకంగా సూచించారు.ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు కృష్ణమూర్తి, గ్రామ వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Related posts

తమిళనాడులో మొదలైన జల్లికట్టు సందడి

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

TV4-24X7 News

పని గంటల పెంపు బిల్లును ఉపసంహరించాలి – సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్నంద్యాల

TV4-24X7 News

Leave a Comment