జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్లతో నిఘా వేశామని జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS తెలిపారు.
.ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణాలు, మండల కేంద్రాలు, శివారు ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లను ఎగురవేశారు. లా & ఆర్డర్ పర్యవేక్షణ, ట్రాఫిక్ జామ్‌లు నివారించడం, బహిరంగ సభలు, ఊరేగింపుల్లో క్రౌడ్ కంట్రోల్, దొంగల్ని గుర్తించడం, పారిపోతున్న వారిని ఛేజ్ చేయడం వంటి కార్యకలాపాల్లో డ్రోన్లు కీలకంగా ఉపయోగపడనున్నాయి.
.అలాగే మహిళలపై ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, చోరీలు, హైవేలపై బైక్ రేసులు, డ్రగ్స్ విక్రయం/సేవించడం, మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీ, పేకాట స్థావరాలు, శివార్లలో ఓపెన్ డ్రింకింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
పోలీసులు భౌతికంగా చేరలేని ప్రదేశాలను కూడా డ్రోన్లతో పరిశీలించి పరిస్థితులపై స్పష్టమైన సమాచారం పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

