మైదుకూరు పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరబల్ల నాగరాజ్ మాదిగ, ఇన్ఛార్జి శ్రీరాముల ఓబులేష్ మాదిగ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, వర్గీకరణ అమలులోకి వచ్చేవరకు ఎస్సీ ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్లకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి 50 శాతం రాయితీతో మందులు ఇవ్వాలని కోరారు.తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 5% రిజర్వేషన్ కల్పించాలనీ, దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను ఖచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచిత ప్రమాద బీమా పాలసీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుబ్బల వెంకటరమణ మాదిగ, పుట్టగాల ప్రసాద్ మాదిగ, తెల్లబల్ల నరసింహులు మాదిగ, నారిపోగు ఇన్నయ్య, బంకు ఓబులేశు, కొండగుల్లి ఓబన్న తదితరులు పాల్గొన్నారు.
previous post

