Tv424x7
Telangana

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్: తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ కేవలం పూల సమాహారం మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన సౌందర్యానికి ప్రతిరూపమని ఆమె అన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమే బతుకమ్మ అని పేర్కొన్నారు.

పూలతో ప్రకృతిని ఆరాధించడం, గౌరమ్మను సత్కరించడం, సోదరీమణులు కలసి పాడుతూ ఆడుతూ జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబిస్తుందని సీతక్క చెప్పారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వుకీ ఔషధ గుణాలు ఉండటం, తిరొక్క పూలతో ప్రకృతి మాతకు కృతజ్ఞత చాటే పండుగగా బతుకమ్మ ప్రత్యేకత సంతరించుకుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటిని ఆనందంతో నింపాలని, తెలంగాణ తల్లికి మరింత కీర్తి చేకూర్చాలని ఆకాంక్షించారు.

Related posts

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

TV4-24X7 News

రోడ్డెక్కిన 10వ తరగతి విద్యార్థులు…. ఎందుకో తెలుసా….

TV4-24X7 News

యూరియా అక్రమ రవాణా ప్రయత్నం భగ్నం..

TV4-24X7 News

Leave a Comment