Tv424x7
Andhrapradesh

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటి..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆర్బీఐ మాజీ గవర్నర్ (RBI Ex Governor) రఘురామరాజన్ (Raghurama Rajan) ఆదివారం జూబ్లీహిల్స్ సిఎం నివాసంలో సమావేశమయ్యారు..కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), సీఎస్ శాంతి కుమారి (CS Shanthi Kumari), స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు (Ramakrishna Rao), సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి (Sheshadri) తదితరుల పాల్గొన్నారు..

Related posts

ప్రమాదంలో తెగిపడిన కారు డ్రైవర్ తల!!

TV4-24X7 News

ఆదర్శ పాఠశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఆల్ఇండియా స్టూడెంట్ యూనియన్

TV4-24X7 News

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

TV4-24X7 News

Leave a Comment