Tv424x7
Andhrapradesh

న్యాయం చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే!!

విజయవాడ, తాడేపల్లి బిసి సంక్షేమ శాఖా మంత్రి క్యాంప్ కార్యాలయంలో సెడ్స్ మాజీ ఉద్యోగులు పెనుకొండ ఎమ్మెల్యే, బిసి సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి సవితమ్మ గారిని కలసి వినతిపత్రం అందజేశారు. సోషియల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ (సెడ్స్), ఆనందపురం, సోమందేపల్లి మండలం నందు 20 నుండి 30 సంవత్సరాలుగా పనిచేయడం జరిగిందని, సంస్థ యందు పనిచేస్తున్నప్పుడు ఉద్యోగుల యొక్క అభివృద్ధి కొరకు “స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్” బ్యాంక్ ఖాతా (SB Ac, 11139087990), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పెనుకొండ నందు తెరచి, ప్రతి నెల స్టాఫ్ కాంట్రిబ్యూషన్ మొదలైన ఆదాయ వనరులను ఆ బ్యాంకు ఖాతాలో జమ చేయడం పరిపాటి.

సంస్థ అధ్యకులు రాజెన్ జాషువా ‘స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్” బ్యాంకు ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేసుకొని తన పేరుమీద తొమ్మిది ఇంటి స్థలాలు సర్వే నెంబర్, 671, మడకశిర రోడ్డు, పెనుకొండ నందు (డాక్యుమెంట్ నెంబర్: 2336/2004 – 0.10 సెంట్లు, 2337/2004 – 0.20 సెంట్లు) రిజిస్టర్ చేసుకొన్నారని తెలిపారు.

ఈ రిజిస్ట్రేషన్ ఒరిజినల్ పత్రాలు మాకు ఇచ్చి, తరువాత మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని సెడ్స్ లెటర్ పాడ్ మీద ఒక లెటర్ తయారుచేసి అందులో 20 సంవత్సరాల పైబడిన ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇస్తామని హామీగా మాకు ఆ లెటర్ యొక్క నకలు కాపీ ఇవ్వడం జరిగింది. ఇదివరకే మేము చాలా సార్లు ఈ ఇంటి స్థలాలు మాకు ఇవ్వమని అడగడం జరిగింది, కానీ దాన్ని దాటవేస్తూ కాలయాపన చేసారు. ఇప్పుడు మాకు మోసం చేసి సంస్థ సి.ఇ.ఒ మానిల్ జాషువ ఆ ఇంటి స్థలాలు అమ్మకమునకు పెట్టారని తెలిసి లాయర్ నోటీసులు పంపించాము, లాయర్ నోటీసులకు ఇంతవరకు బదులు లేదు.

సెడ్స్ సంస్థ అధ్యక్షులు రాజెన్ జాషువకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం అయి, ఎవరిని గుర్తు పట్టే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో సి.ఇ. ఒ మానిల్ జాషువ తన కుమారుడు రోహిత్ జాషువ, కుమార్తె రాష్నా లీలాని జాషువ పేరు మీద ధర్మవరం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 25-01-2018 వ తేదీన దాన విక్రయం చేశారు. మాకు మోసం చేసిన సంస్థ నుండి మాకు తగిన న్యాయము చేసి మా ఇంటి స్థలాలు మాకు ఇప్పించవలెనని పెనుకొండ ఎమ్మెల్యే, బిసి సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి సవితమ్మ గారిని కోరారు. దానికి పెనుకొండ ఎమ్మెల్యే, బిసి సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి సవితమ్మ గారు స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

వన్ టౌన్ పోలిస్ స్టేషన్ లో ఓపెన్ హౌజ్ కార్యక్రమం ముఖ్య అతిదిగా ఏ సి పి టి.త్రినాధ్ రావు పాల్గొన్నారు

TV4-24X7 News

వారు నాకు శత్రువులు కాదు నా శిష్యులే:కేఏ పాల్

TV4-24X7 News

వినాయక నిమజ్జన యాత్రలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది.

TV4-24X7 News

Leave a Comment