కొలంబో:
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 38.3 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌట్ అయింది. షోర్నా అక్తర్ మూడు, మరూఫా అక్తర్, నహిదా అక్తర్ రెండు వికెట్లు సాధించగా, మిగిలిన బౌలర్లు కీలక వికెట్లు పడగొట్టారు.
లక్ష్యాన్ని సులభంగా ఛేదించిన బంగ్లాదేశ్ జట్టు సమష్టిగా రాణించి విజయాన్ని ఖాయం చేసింది.

