Tv424x7
Andhrapradesh

ఎన్టీఆర్ జిల్లా రోడ్డు ప్రమాదం!!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల శివారులో జాతీయ రహదారిపై శనివారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక టాటా ఏస్ ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ఎయిర్‌బెలూన్స్ (ఎయిర్‌బ్యాగ్స్) తెరుచుకోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

టాటా ఏస్ వాహనంలో లోడ్ చేసిన ఐరన్ రాడ్లు ఢీకొన్న సమయంలో రహదారిపై పడిపోయాయి. దీంతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రహదారిని క్లియర్ చేసి వాహనాల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వాహనాలు దెబ్బతినడంతో ఆర్థికనష్టం సంభవించింది.

Related posts

మదనపల్లెలో భార్యపై కోపంతో వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య యత్నం

TV4-24X7 News

నిరాశ్రయుల వసతి గృహాన్ని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ పర్యవేక్షణ

TV4-24X7 News

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

TV4-24X7 News

Leave a Comment