Tv424x7
Andhrapradesh

ఒంటరి మహిళకు సీఐ వేధింపులు..

నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌లో మరో పోలీసు అధికారి దారుణం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ) కంబగిరి రాముడు ఓ ఒంటరి మహిళను అసభ్యంగా వేధిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి.

బాధితురాలు మీడియా ముందు కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ — “సీఐ నన్ను న్యూడ్ కాల్స్ చేయమంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు.

‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌..! నీ పిల్లలను బాగా చూసుకుంటాను… ఖాళీగా ఉంటే పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రా’ అంటూ అసభ్య మెసేజ్‌లు పంపించాడు,” అని తెలిపింది.

తనను, తన పిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులు కూడా ఇచ్చాడని ఆమె ఆరోపించింది. ఇక తాను న్యాయం కోసం నేరుగా హోంమంత్రినే కలుస్తానని స్పష్టం చేసింది.

ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానికంగా సంచలనం రేగింది. ప్రజలు పోలీస్‌ అధికారుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు: “ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి!”

మహిళా సంఘాలు: “ఘటనా వివరాలు బహిర్గతం చేయాలి, బాధితురాలికి రక్షణ కల్పించాలి!”

ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారగా, ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

దువ్వూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహణ

TV4-24X7 News

బైక్ వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ ఉండాలిట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు

TV4-24X7 News

ఆర్య వైశ్య స్టేట్ డైరెక్టర్ కొల్లూరు రూపను సత్కరించిన కందుల

TV4-24X7 News

Leave a Comment