Tv424x7
National

పెట్రోల్ కారు ధరలకు సమానం కానున్న ఎలక్ట్రిక్ వాహనాల ధర!న్యూఢిల్లీ:

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 4 నుండి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా మారనున్నట్లు తెలిపారు.

ఢిల్లీలో జరిగిన 20వ FICCI ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, “భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా నిలపడం మా లక్ష్యం” అని తెలిపారు.

ప్రస్తుతం భారత్ ఆటోమొబైల్ రంగంలో మూడో స్థానంలో ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఈవీల ధరలు ప్రస్తుతం సాంప్రదాయ వాహనాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, త్వరలోనే తగ్గుముఖం పడతాయి అని తెలిపారు.

“పర్యావరణహిత వాహనాలే భవిష్యత్తు. ఈవీ రంగంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది” అని మంత్రి గడ్కరీ అన్నారు.

Related posts

పోలీసుల వాహనంపై నక్సలైట్ల దాడి

TV4-24X7 News

ఐటీ ఈ ఫైలింగ్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15వ తారీకు తో ముగుస్తుంది.

TV4-24X7 News

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!*

TV4-24X7 News

Leave a Comment