Tv424x7
Andhrapradesh

దువ్వూరులో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

కడప జిల్లా, దువ్వూరు:ఆటవిక జీవనానికి ముగింపు పలికి మహర్షిగా పరివర్తన చెందిన రత్నాకరుడు — నారద మహర్షి మంత్రోపదేశంతో తపస్సు చేసి వాల్మీకి మహర్షిగా అవతరించి, ఆదికావ్యమైన రామాయణం రచించి మానవజాతికి ధర్మమార్గాన్ని చూపిన మహనీయుడు.అయన జయంతి సందర్భంగా దువ్వూరు వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించి, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, భక్తిపూర్వకంగా పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వాల్మీకి సంఘ నాయకులు, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

అమ్మవారి సేవలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

TV4-24X7 News

రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి…– బాలాజీ విద్యాసంస్థల అధినేత రవీంద్రనాథ్ రెడ్డి

TV4-24X7 News

ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప

TV4-24X7 News

Leave a Comment