Tv424x7
Crime News

చెన్నైలో వ్యభిచారం బహిర్గతం – హాస్యనటుడు భారతి కన్నన్‌ సహా ఆరుగురు అరెస్ట్‌

చెన్నై:

కోయంబేడు వంద అడుగుల రోడ్డులోని ఓ వసతి గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు ఆగస్టు 24న పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, కేకే నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అక్కడ నుంచి రక్షించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ సహాయనటి నాగలక్ష్మి, ఆమె స్నేహితురాలు అంజలి, అలాగే కార్తిక్, కుమార్‌లను అరెస్టు చేశారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి.

బాలిక తండ్రి మరణించడంతో తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయింది. దాంతో ఆ బాలిక తన తల్లి స్నేహితురాలు పూంగొడి (క్లబ్ డ్యాన్సర్), ఆమె స్నేహితురాలు ఐశ్వర్య వద్దకు చేరింది. వీరిద్దరు హాస్యనటుడు భారతి కన్నన్‌తో కలిసి ఆ బాలికను వ్యభిచారానికి వాడుకున్నట్లు విచారణలో తేలింది.

ఇందువల్ల భారీ మొత్తంలో డబ్బు సంపాదించినట్టు ఆధారాలు దొరకడంతో, పోలీసులు పూంగొడి, ఐశ్వర్యను మంగళవారం అరెస్టు చేశారు. అదేవిధంగా భారతి కన్నన్‌తో పాటు అతని స్నేహితులు మహేంద్రన్, రమేష్లను పోక్సో చట్టం (POCSO Act) కింద అరెస్టు చేశారు.

Related posts

రూ.2 వేల కోసం హత్య… రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

TV4-24X7 News

మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్

TV4-24X7 News

పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థినిపై దారుణ అత్యాచారం.. రాష్ట్రంలో కలకలం

TV4-24X7 News

Leave a Comment