Tv424x7
Andhrapradesh

అల్లిపల్లిలో లంచాల గుసగుసలు!

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోందనే సమాచారం బయటకు వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్కడ రెవెన్యూ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ, పర్యవేక్షణ లోపంతో అవినీతి బహిరంగ రహస్యంగా మారిందని లారీ యజమానులు చెబుతున్నారు.

స్థానిక సమాచారం ప్రకారం, చెక్‌పోస్ట్ వద్ద పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది లారీ యజమానుల నుంచి ఒక్కో లారీకి ₹1000 నుంచి ₹2500 వరకు వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. లారీలు సిబ్బంది కళ్లముందే తెలంగాణ వైపు తరలి వెళ్తున్నాయని అంటున్నారు.

చెక్‌పోస్ట్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ వైపు పట్టుబడిన లారీలు లేవు. అయితే తెలంగాణలో మాత్రం ఆ లారీలు తరచుగా పట్టుబడుతున్నాయి. ప్రతిరోజూ సుమారుగా 6 నుంచి 10 లారీలు అల్లిపల్లి చెక్‌పోస్ట్ దాటుతున్నట్టు సమాచారం.

గత రాత్రి చింతలపూడి పోలీసులు మూడు టిప్పర్ లారీలను పట్టుకున్నప్పటికీ, అదే సమయంలో మరో నాలుగు లారీలు తెలంగాణలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

Related posts

నేటి నుంచి RBI కొత్త రూల్స్!!

TV4-24X7 News

పోస్ట్ ఆఫీస్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ – తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు!!

TV4-24X7 News

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

TV4-24X7 News

Leave a Comment