ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఒక ప్రేమజంటపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది.స్థానికంగా నివసిస్తున్న దుక్కాన అనే యువకుడు, మున్నీ అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.ఇంట్లో పెద్దలు వీరి ప్రేమను వ్యతిరేకించడంతో, ఇద్దరూ గుజరాత్‌కి వెళ్లి వివాహం చేసుకున్నారు.చెల్లి ఇలాగే పారిపోయిందనే అవమానం భరించలేకపోయిన అన్నలు,“ఊర్లోనే గ్రాండ్‌గా పెళ్లి చేస్తాం” అంటూ మున్నీని, ఆమె భర్తను ఒప్పించారు.వారి నమ్మకంతో మున్నీ, దుక్కాన తిరిగి ఊరికి వెళ్లేందుకు అంగీకరించారు.అయితే, హథినాలా గ్రామం వద్దకు చేరుకున్న తర్వాత“టాయిలెట్‌కి వెళ్దాం” అంటూ జంటను అడవిలోకి తీసుకెళ్లిన అన్నలు —అక్కడే మున్నీతో పాటు ఆమె భర్త దుక్కానను కత్తులతో దారుణంగా హత్య చేశారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితులుగా మున్నా కుమార్, రాహుల్ అనే ఇద్దరు సోదరులను గుర్తించి అరెస్ట్ చేశారు.ప్రేమజంటను నమ్మించి ఊరికి రప్పించి చంపిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

