Tv424x7
Telangana

ఎల్కతుర్తి | బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కీర్తన (19) ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం — గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌ దంపతుల చిన్న కుమార్తె కీర్తన హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. అధ్యాపకులు చెప్పే పాఠాలు అర్థం కావటం లేదని, తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండలేకపోతున్నానని తరచూ బాధపడేది.

తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకువచ్చి, మరో కళాశాలలో చేర్పించాలని ప్రయత్నిస్తుండగా, అక్టోబర్‌ 10న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కీర్తన ఉరేసుకుంది. తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి గమనించి, వెంటనే వైద్యుడిని పిలిపించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

తండ్రి కృష్ణాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎల్కతుర్తి పోలీస్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ — “మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించాం, కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు.

Related posts

హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ దాడి

TV4-24X7 News

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ.. ఆరుగురికి మళ్లీ నోటీసులు!!

TV4-24X7 News

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

TV4-24X7 News

Leave a Comment