Tv424x7
Telangana

150 ఏళ్ల క్రితం విద్యుత్తు లేకుండానే పనిచేసిన లిఫ్ట్‌!

హైదరాబాద్‌ :హైదరాబాద్‌ నగరంలో నిజాం నవాబుల కాలం నాటి అరుదైన సాంకేతిక అద్భుతం ఇప్పుడు సందర్శకులను ఆకట్టుకుంటోంది. సుమారు 150 ఏళ్ల క్రితం విద్యుత్తు అవసరం లేకుండా పనిచేసిన లిఫ్ట్ ఇప్పటికీ సమృద్ధిగా పనిచేసే స్థితిలో ఉందని అధికారులు తెలిపారు.

పురానాహవేలీలోని నిజాం మ్యూజియంలో ఈ లిఫ్ట్‌ను ప్రదర్శనకు ఉంచారు. లండన్‌కు చెందిన ఆర్‌వే గుడ్‌ కంపెనీ రూపొందించిన ఈ లిఫ్ట్‌ బలమైన తాళ్లు, చక్రాలతో పనిచేసే విధంగా రూపుదిద్దుకుంది. విద్యుత్‌ లేకపోయిన రోజుల్లో మనుషులే చేతితో ఆపరేట్‌ చేసేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఆరో నిజాం మీర్‌ మెహబూబ్‌ అలీఖాన్‌ మొదటగా ఈ లిఫ్ట్‌ను వినియోగించగా, తరువాత చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కూడా ఉపయోగించారు. ఎనిమిది మంది సామర్థ్యం గల ఈ చెక్కల లిఫ్ట్‌ నేటికీ పాత చారిత్రక గౌరవాన్ని నిలబెట్టుకుంటూ సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది.

Related posts

గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్డేట్

TV4-24X7 News

మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా బి.విజయేంద్ర నియామకం

TV4-24X7 News

నేడు రేవంత్ రెడ్డి విశాఖలో పర్యటన

TV4-24X7 News

Leave a Comment