అమరావతి:
ఏపీలో పేద ప్రజలకు ఊరటగా నిలిచే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రోజులుగా పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించడం ఆగిపోయింది.
ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో గత్యంతరం లేక ప్రభుత్వ ట్రస్టు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు.
ఇదే సమయంలో, ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది.
వారు ప్యాకేజీ రేట్లను పెంచాలని, గత బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే సేవలు పునరుద్ధరించలేమని హెచ్చరించారు.
రోగులు మాత్రం తమకు మినహాయింపు ఇవ్వాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

