Tv424x7
Telangana

కొడుకు నిర్లక్ష్యంతో విసిగి రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి (2006–2011) తన కొడుకు ప్రవర్తనతో విసిగి, తన రూ.3 కోట్ల విలువైన ఆస్తిని ప్రభుత్వానికి దానం చేశారు.

శ్యామ్ సుందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం — తన కొడుకు రంజిత్ రెడ్డి ఆస్తి లాక్కొని ఇంటి నుండి బయటకు గెంటేశాడని, కూతురికి కట్నంగా ఇచ్చిన భూమిని కూడా ఆక్రమించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అడిగితే దాడికీ పాల్పడ్డాడని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలను ప్రభుత్వానికి దానం చేయాలని నిర్ణయించి, హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌కు దానాన్ని అధికారికంగా తెలిపారు.

ఆ స్థలంలో తన మృత భార్య వసంత జ్ఞాపకార్థం ఒక భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన శ్యామ్ సుందర్ రెడ్డి, “తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఇది గుణపాఠం కావాలి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

Related posts

హైదరాబాద్ చేరుకుంటున్న అందమైన భామలు లేత మెరుపు తీగలు

TV4-24X7 News

తెలంగాణలో సీబీఐకి డోర్ ఓపెన్.. కానీ కాళేశ్వరం విచారణ వరకు మాత్రమే….

TV4-24X7 News

ఏసీబీ అధికారుల గాలానికి అవినీతి తిమింగలం

TV4-24X7 News

Leave a Comment