Tv424x7
Telangana

హోంగార్డు దుర్మార్గం.. గర్భస్రావం ప్రయత్నంలో మహిళ దుర్మరణం..

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 15:ప్రేమ పేరుతో మోసపోయిన మహిళ ఓ దారుణాంతానికి గురైంది. హోంగార్డు మోసపూరిత సంబంధంతో గర్భవతిని చేసిన ఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, హోంగార్డు మధుసూదన్ అనే వ్యక్తి స్థానిక మహిళ మౌనిక (29)తో ప్రేమ పేరుతో సంబంధం కొనసాగించాడు. ఇటీవల ఆమె గర్భవతిగా మారడంతో ఈ విషయం బయటపడుతుందనే భయంతో మధుసూదన్, ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ సాయంతో గర్భస్రావం (అబార్షన్) చేయించాలని నిర్ణయించాడు.

అయితే వైద్యం జరుగుతున్న సమయంలో పరిస్థితి విషమించి మౌనిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హోంగార్డు మధుసూదన్, ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Related posts

మైనర్ల మత్తు పార్టీ: ట్రాప్ హౌస్ దాడి.

TV4-24X7 News

వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్…

TV4-24X7 News

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఫోన్‌లో చిత్రీకరించిన యువకులు

TV4-24X7 News

Leave a Comment