Tv424x7
Andhrapradesh

జగన్ సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు: సోమిరెడ్డి ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు గుప్పించారు. “జగన్ తీరు పాపాలు చేసేవాళ్లు నీతులు చెప్పినట్లుంది” అంటూ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు.గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో అదే డేటా సెంటర్‌ను గోడౌన్ అని, పెద్ద ప్రాజెక్టు కాదని తమ పత్రిక సాక్షిలో రాయించారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును తానే తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. పెట్టుబడులను ఆకర్షించలేకపోయి, జాకీ వంటి కంపెనీలను వెళ్లగొట్టిన ఘనత జగన్‌దే” అని విమర్శించారు.నకిలీ మద్యం వ్యవహారంలో జగన్ పాత్ర ఉందని సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “జగన్-జోగి రమేశ్-జనార్ధన్ రావు కాంబినేషన్‌లో నకిలీ మద్యం తయారీ జరుగుతోంది. మద్యం బాటిల్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అసలు నిజాలు బయటికొస్తాయి. జగన్‌కి ధైర్యం ఉంటే ఆయనే స్కాన్ చేసి ప్రజలకు చూపించాలి” అంటూ సవాల్ విసిరారు.జగన్ అభివృద్ధి పేరుతో మాట్లాడటం హాస్యాస్పదమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. “రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లూ జగన్‌ను సగం పిచ్చోడనుకున్నాం, ఇప్పుడు పూర్తి పిచ్చోడని అర్థమవుతోంది” అంటూ సోమిరెడ్డి తన ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

Related posts

బ్యాడ్మింటన్ క్రీడాకారుని అభినందించిన విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

కానిస్టేబుల్ స‌త్య‌కుమార్ కుటుంబానికి రూ.30 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందజేసిన సీఎం

TV4-24X7 News

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

TV4-24X7 News

Leave a Comment